అజయ్‌ పాల్ కి ఆశారాం కేసులో బెదిరింపు లేఖలు ఫోన్‌ కాల్స్‌

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై నమోదైన రేప్‌ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధకార అజయ్‌ పాల్‌ లంబా ఎదుర్కొన్న సవాళ్లివి. ఆశారాంపై రేప్‌ కేసును విచారిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు, శిష్యులు తననకు బెదిరింపులు వెల్లువెత్తాయని, బెదిరింపు లేఖలు, ఫోన్‌కాల్స్‌తో తనను భయపెట్టాలని ప్రయత్నించారని ఆయన తెలిపారు.

మైనర్‌పై అత్యాచారం జరిపిన కేసులో జోథ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు బుధవారం ఆశారాంను దోషిగా తేల్చి.. ఆయనకు జీవితఖైదు విధించింది. తన కెరీర్‌లోనే అత్యంత హైప్రొఫైల్‌ కేసు ఇదని ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు జరిపిన ఐపీఎస్‌ అధికారి అజయ్‌పాల్‌ లంబా తెలిపారు. 2019 ఆగస్టు 20న తనకు ఈ కేసును అప్పగించారని, అప్పటికే ఈ కేసుపై మీడియా ఫోకస్‌ తీవ్రంగా ఉందని, పలువురు సాక్షులు హత్యకు గురయ్యారని, దీనికి తోడు ఆశారాం శిష్యుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బెదిరింపులు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అజయ్‌పాల్‌ జోథ్‌పూర్‌ వెస్ట్‌ డీసీపీగా ఉండేవారు.

‘లేఖల్లో తీవ్రమైన దూషణలు ఉండేవి. ఆశారాంకు ఏమైనా జరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని హెచ్చరించేవారు. నా ఫోన్‌ నిరంతరం మోగుతూనే ఉండేది. దీంతో గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తే ఎత్తేవాడిని కాదు. నేను ఉదయ్‌పూర్‌కు మారిన తర్వాత బెదిరింపు లేఖలు ఆగిపోయాయి’ అని 2005 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో తన కూతుర్ని కొంతకాలం పాఠశాలకు పంపలేదని, తన భార్య కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఏసీబీ ఎస్పీగా జోథ్‌పూర్‌లో నివాసముంటున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తే.. కేసుకు సంబంధించిన సాక్షిని తానే చంపానని ఒప్పుకున్నాడని, అంతేకాకుండా మరో అప్పడి జోథ్‌పూర్‌ డీఎస్పీ చంచల్‌ మిశ్రాను కూడా చంపేందుకు టార్గెట్‌ చేసినట్టు వెల్లడించాడని తెలిపారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన పదివారాల్లోనే మొదటి చార్జ్‌షీట్‌ దాఖలు చేశామని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, అయితే, కేసులోని చిక్కుముడుల వల్లే దర్యాప్తు కొంత జాప్యమైందని ఆయన తెలిపారు.