అతడిని నిజంగానే చంపేస్తానేమో అనుకున్నారు.

సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా, నవాబ్‌ సైఫ్‌ అలీఖాన్‌ జంటగా తెరకెక్కిన ‘సలామ్‌ నమస్తే’ సినిమాకు నేటితో13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌ సమయంలోని జ్ఞాపకాలను ప్రీతి జింటా గుర్తు చేసుకున్నారు. ‘ వావ్‌. సినిమా షూటింగ్‌ సమయంలో ఎంతో ఎంజాయ్‌ చేశాను. కెమెరా ముందు, వెనుక కూడా సైఫ్‌తో విపరీతంగా గొడవ పడేదాన్ని. ఒక్కోసారి నటించడం మానేసి జీవించేదాన్ని. దీంతో నేను సైఫ్‌ను నిజంగానే చంపేస్తానేమో అని సిబ్బంది కంగారుపడేవారు. అంతలా కొట్టుకునే వాళ్లం. సైఫ్‌ను మిస్సవుతున్నా. సలామ్‌ నమస్తేకు 13 ఏళ్లు పూర్తయ్యాయి’ అంటూ ప్రీతి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

కాగా ఐపీఎల్‌ టీమ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా ఈ మధ్య సినిమాలు తగ్గించేశారు. కేవలం అతిథి పాత్రలకే పరిమితమయ్యారు. వ్యాపారవేత్తగా సెటిలైన ప్రీతి.. 2016లో తన స్నేహితుడు జీన్‌ గుడెనఫ్‌ను పెళ్లి చేసుకున్నారు.