అతీంద్రీయ శ‌క్తులా ,సైన్సా ఏది నిజం …..?

 

2018లో వున్నా మ‌నం ఏది న‌మ్మాలో, ఏది న‌మ్మోదో తెలియ‌ని ప‌రిస్థితిలో కొంద‌రు వున్నారంటే అతిష‌యోక్తి కాదు ….ఒక మ‌నిషికి జ్వ‌రం వ‌స్తే డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ళె మ‌నం ఆ జ్వ‌రం రావ‌డానికి ఒక నోటి మాట కార‌ణం అని న‌మ్మే వాళ్ళు మ‌న‌దేశంలో చాలా మందే వున్నారంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు ….సైన్స్ అనేది ఎంత‌లా అభివృద్ధి చెందుతుందో చెప్ప‌లేం కాని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంద‌నే చెప్పాలి కొంద‌రిని చూస్తుంటే ,మూడ‌న‌మ్మ‌కాల గురించి చెప్పెవాళ్ళ‌కంటే వినే వాళ్ళె ఎక్కువ భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్న‌ట్లు ఒక స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది .. ………ఒక వ్య‌క్తి చెప్పుడు మాట‌లు విని అత‌డు ఎందుకు చెపుతున్నాడో అనే దాని క‌న్నా అత‌ని మాట‌కే విలువివ్వ‌డం మ‌న తెలివి త‌క్కువ త‌నం అనాలో లేక అనాగ‌రికుల్లా బ్ర‌తుకుతున్నాం అనాలో మీరే తెలుసుకుంటే భాగుంటుంది . … దీన్ని బ‌ట్టి ఒక మ‌నిషిలో మూఢ‌న‌మ్మ‌కాల‌గురించి భ‌యం అనేది ఏ రేంజ్‌లో వుందో అర్థ‌వుతుంది . ఇంకా ఈ స‌ర్వేలో ఉన్నా ప‌లు విష‌యాలు గురించి ప్ర‌స్తావిస్తే న‌మ్మ‌లేని నిజ‌లు వెలుగులోకి వ‌చ్చాయి .. పాము ఖ‌ర్చిన‌పుడు పాము విషం వ‌ల్ల కాకుండా పాము క‌రిస్తే చచ్చిపోతా అనే భ‌యంతోనే మ‌ర‌ణించే వారి సంఖ్య అధికంగా వున్నాయ‌ని డాక్ట‌ర్‌లు అంటున్నారు . ఇప్పుడు ఇదే విష‌యం మూఢ‌నమ్మ‌కాల‌కు కూడ అనువ‌ర్తించ‌వ‌చ్చు అని ఈ స‌ర్వేలో వెళ్ళ‌డ‌య్యింది . ఒక వ్య‌క్తికి ఎదో వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్మ‌డం వ‌ల‌న మొద‌ట మ‌న మీద మ‌న‌కే న‌మ్మ‌కం పోతుందట ,దీనికి కార‌ణం నువ్వు అత‌న్ని న‌మ్మి నిలో నువ్వె భ‌యాన్ని ఏర్ప‌రుచు కోవ‌డ‌మేన‌ట ,ఒక వేళ అత‌నికి అంత శ‌క్తే వుంటే కోటిశ్వ‌రుడు అవ్వ‌డ‌మో లేక ఏ దేశానికి అన్నా ప్ర‌ధాని అవ్వ‌డ‌మో చెయ్యోచ్చు క‌దా మ‌రి అలా ఎందుకు చేయ‌డం లేదు …….,ఎందుకంటే వానికి ఏం రావు కాబ‌ట్టి ,అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ వారి నుండి డ‌బ్బులు గుంజ‌డం పూట గ‌డ‌ప‌డానికే అని తెలుసుకోక పోతే ఎవ‌రేం చేయ‌లేర‌నే చెప్పాలి .ఇక్కడ ఇంకో విష‌యం ఎంటంటే చ‌దువుకున్నా కొంద‌రు యువ‌త కూడ ఈ మూఢ‌న‌మ్మ‌కాలను న‌మ్ముతున్నారట ….., సైన్స్ ఇంత అబివృద్ధి చెందుతున్న కాలంలో ,సైన్స్ గురించి తెలిసికూడ యువ‌త మూఢ‌న‌మ్మ‌కాల‌ను న‌మ్మ‌ఢం అనేది ఎంత సిగ్గుచేటో తెలుసుకుంటే మంచిద‌ని అన‌క త‌ప్ప‌డం లేదు .ఎంతో మంది శాస్త్రజ్ఙులు త‌మ మేద శ‌క్తిని ఉప‌యోగించి వేరే గ్ర‌హం పై స్థిర‌నివాసం ఏర్ప‌రుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటే , దానిని న‌మ్మ‌డం మానేసి , నా ద‌గ్గ‌రికి వ‌స్తే మంచి జ‌రుగుతుందని ,మీ స‌మ‌స్య‌లు అన్ని ప‌రిష్క‌రిస్తా అంటే న‌మ్మి వాని ద‌గ్గ‌రికి వెళ్తే మీ డ‌బ్బులు పోయి మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం త‌ప్ప మ‌రోక‌టి ఉండ‌ద‌నే చెప్పాలి ….మూడ‌న‌మ్మ‌కాల‌ను న‌మ్మే ముందు ఒక్క సారి మీరు వాడు మ‌నిషే మ‌నం మ‌నిషేన‌ని ఆలోచ‌న తెచ్చుకుంటే మంచిద‌ని మీరు ఇప్ప‌టికైనా తెలుసుకోక త‌ప్ప‌దనే చెప్పాలి ..ఈ మూఢ‌న‌మ్మ‌కాలను న‌మ్మ‌ఢం వ‌ల్ల భ‌యం ,అనుమానం త‌ప్ప ఒక మ‌నిషికి ఒరిగేది ఏమిలేదని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలుసుకుంటే మంచిది ..ఒక మ‌నిషి చెసే ప‌నుల‌ను మిషిన్‌ల‌తో చేపిస్తున్నా మ‌న సైన్స్ గురించి తెలుకుంటే మీకు మూఢ‌న‌మ్మ‌కాలు అనేవి ఊహ‌జ‌నితం త‌ప్ప న‌మ్మ‌శ‌క్యం కానివిగా మిగిలి పోతాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేద‌నే చెప్పాలి … ఒక ప్ర‌దేశంలో వున్నా మ‌నం వెరో ప్ర‌దేశంలో వున్నా మ‌నిషితో మ‌నం చూసుకుంటూ మాట్లాడుతున్నం అంటే దానికి కార‌ణం సైన్స్ ఇంత‌లా అభివృద్ధి చెందిన మ‌నం ఎటువైపు అడుగులు వేస్తున్నామో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం…..