ఆంధ్రాలో బి జే పి రాష్ట్ర అధ్య‌క్షుడి రాజినామా

ఆంధ్రా బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుడి హోదాలో ఇన్ని రోజులు కంభంపాటి హ‌రిబాబు కొన‌సాగారు .అయితే ప్ర‌స్తుతం హ‌రిబాబు రాష్ట్ర అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజినామ చేసారు .ప్ర‌స్తుతం కంభంపాటి హ‌రిబాబు విశాఖ‌ప‌ట్నం ఎంపీగా విధులు నిర్వ‌హిస్తున్నారు .హ‌రిబాబు బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుడి హోదాలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీని బ‌లోపెతం చేయ‌డానాకి త‌ను చాలా కృషి చేసాడ‌నే చెప్పాలి .అలాంటి వ్య‌క్తి ఇప్పుడు ఉన్న‌ట్టుండి త‌న రాజీనామ లేక‌ను అమిత్‌షాకు పంప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది .హ‌రిబాబే రాజీనామ చేసాడా లేక బిజేపి వాళ్ళే రాజీనామ చేయించారా అని కూడ కొంద‌రిలో అనుమానం కూడ మొద‌లైంది . ఎందుకంటే ఇన్ని రోజులు బిజేపితో పోత్తుపెట్టుకున్నా టిడిపి ఇప్పుడు తెగ‌దెంపులు చేసుకున్నా విష‌యం అంద‌రికి తెలిసిందే ,…అయితే బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుడి హోదాలో వున్నా హ‌రిబాబు టిడిపి ని ఒక్క మాట కూడ అన‌డం లేద‌టా……అయితే బిజేపి పార్టీ వాళ్ళు టిడిపి చేసే విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే ,హ‌రిబాబు మాత్రం నిమ్మ‌కు నీరెత్త‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ,బిజేపి పార్టీ వాళ్ళు జాతీయ అధ్య‌క్షునికి పిర్యాదు చేసార‌టా అని వార్త‌లు వినిపిస్తున్నాయి .దీంతో బిజేపి జాతియ అధ్య‌క్షుడు అమిత్‌షానే హ‌రిబాబును రాజీనామ చేయ‌మ‌ని సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం .ఇప్పుడు కంభంపాటి హ‌రిబాబు రాజీనామ చేయ‌డంతో, ప్ర‌స్తుతం ఆంధ్రాలో బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుని కొసం కొంద‌రు అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌టా ……అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలో ఎల‌క్ష‌నులు జ‌రుగుతుండ‌డంతో, ఆ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన బిజేపి జాతీయ నేత‌లు, ప్ర‌స్తుతం ఆంధ్రా అధ్య‌క్షునున్ని నియ‌మించే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టార‌టా …..దీంతో అమిత్‌షా క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్‌ల త‌ర్వాత ఆంధ్రాలో బిజేపి రాష్ట్ర అధ్య‌క్షున్ని గురించి ఆలోచిస్తాన‌న‌డంతో, ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్రాలో రాష్ట్ర బిజేపి అధ్య‌క్షుని కోసం హ‌డావిడి చేసిన నేత‌లలో ,ఇప్పుడా హ‌డావిడిని త‌గ్గింద‌నే అనుకోవాలి … …అయితే ఇప్పుడు ఆంధ్రాలో బిజేపి రాష్ట్ర అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేది తెలియాలంటే క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్‌లు అయిపోయేదాక ఆగాల్సిందే మ‌రి ……………