ఆక‌లి త‌గ్గాలంటే ప్రోటీన్లు తినండం మేలు

 

మ‌న శ‌రీరం అందంగా స్లిమ్‌గా కావాలంటే తిన‌డం మానేయ‌డ‌మో లేక ఎక్కవ వ్యాయామాలు చేయ‌డ‌మో చేస్తుంటాం ,అయితే ఇప్పుడు ఎలాంటి వ్యాయామాలు లేకుండానే మ‌నం బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌వ‌చ్చు ,అయితే దానికి మ‌నం చెయాల్సింది కూడ అంత‌గా ఏమి లేదు ,రోజు ఉద‌యం లేవ‌గానే ప్రోటీన్‌లు ఎక్కువ‌గా ఉండే గుడ్లు ,తృణ‌దాన్యాలు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల మిగ‌తా రోజుల‌లో ఎక్కువ ఆహారం తీసుకునే స‌మ‌స్య ఉండ‌ద‌ని వైద్య ప‌రిశోద‌కులు అంటున్నారు .ఇలాంటి ప్రొటీన్లు ఉన్నా ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మిగ‌తా రోజుల‌లో త‌క్కువ ఆహారం తీసుకోవ‌డం జ‌రుగుతుందని ప‌రిశోద‌న‌లో వెల్ల‌డైంది . 18నుండి 55సంవ‌త్స‌రాల పైబ‌డినా స్త్రీలు ఎక్కువ‌గా కార్బోహైడ్రేట్లన్నా ప‌దార్థాలు తిన‌డం ,లేదా బ్రేక్ ఫాస్ట్ మానేయ‌డం వంటివి చేస్తుంటారు .అయితే ఇవి మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావని అంటున్నారు ఆరోగ్య‌నిపుణులు .300కాల‌రీల ప్రోటీన్ ఆహారాన్ని అందిచాకా రోజంతా ఎలా అనిపిస్తుందంని మ‌హిళ‌ల‌ను అడిగితే తొంద‌ర‌గా ఆక‌లి వేయ‌డం లేద‌ని ,క‌డుపు నిండుగా ఉన్న‌ట్లు ఉంద‌ని,మ‌ద్యాహ్నం బోజ‌నంలో త‌క్కువ ఆక‌లి వేస్తుంద‌ని ,ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నామ‌ని స‌మాదానం చెప్పిన‌ట్లు వైద్య ప‌రిశోద‌కులు వెల్ల‌డించారు .అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ మానేయ‌డం లేదా ప్రోటీన్‌లు త‌క్కువ‌గా ఉన్న‌టువంటి తిండి తిన‌డం వంటివి చేస్తుంటారు .వాటికి బ‌దులు గుడ్లు తృణ‌దాన్యాల‌ను తీసుకోవ‌డం చాలా మంచిద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు .