ఆడ‌వాళ్ళు ఇలా చేస్తే ల‌క్ష్మి దేవి మీ ఇంట్లోనే ఉంటుంది

ఎదైనా ఇంటికి వెళితే ఇల్లును చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్ప‌వ‌చ్చు .ఇల్లు ప‌రిశుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాలు ఉత్త‌మురాలు అని పెద్ద‌లు చెపుతుంటారు . ఇంటిని పరిశుభ్రంగా వుంచితే ఈ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ స్థిర నివాస‌ముంటుంది . సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి.అతా కాకుండా బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి. లేటుగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతోపాటు వంటికి బాధలు తప్పవు.కుటుంబానికి వండిపెట్టడం దేవుడికి వంటచేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించ‌డం ఎంతో ఉత్త‌మ‌మైనా మార్గం .దైవ ప్రార్థన చేసిన, నైవేద్యం సమర్పించిన తర్వాతే ఏదైనా స్వీకరించాలి. ఫుల్‌గా లాంగించేసి దేవుడికి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్లిపోతుంది.సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వడం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషం అనేది క‌నుమ‌రుగ‌వుతుంది .అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.