ఆధార్‌ కార్డులో మొబైల్‌ నెంబర్‌ని మార్చడం

* ఆధార్‌ కార్డులో మొబైల్‌ నెంబర్‌ని మార్చడం ఎలాగో తెలుపగలరు?

– ఎం.వీ.రమణా రావు
ఆన్‌లైన్‌ టూల్స్‌తో ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ మార్చుకోవడం సులువే. Aadhaar self-service update portal పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యి ‘ఆధార్‌ అప్‌డేట్‌ రిక్వస్ట్‌’ని మూడు స్టెప్పుల్లో ముగించొచ్చు. ఆధార్‌తో లాగిన్‌ అయ్యాక మార్చాలనుకునే డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్‌ చేసి సర్వీసు ప్రొవైడర్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. మొత్తం ప్రాసెస్‌ ముగించడానికి ఆధార్‌కి అనుసంధానం చేసిన మొబైల్‌ నెంబర్‌ అనివార్యం. ఎందుకంటే సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు పాస్‌వర్డ్‌ రిజిస్టరైన ఫోన్‌కే వస్తుంది. అదీ మొదట్లో ఆధార్‌ ఎన్‌రోల్మెంట్‌ చేసుకున్నప్పుడు ఎంటర్‌ చేసిన నెంబర్‌ పాస్‌వర్డ్‌ సెండ్‌ అవుతుంది.
వెబ్‌ లింక్‌: https:up.uidai.gov.in/web/guest/update
ఆధార్‌ అప్‌డేట్‌ని మరింత వివరంగా తెలుసుకునేందుకు https://goo.gl/f1Tcui
* ఫేÆస్‌బుక్‌ నుంచి డిలీట్‌ చేసిన మెసేజ్‌లను రికవర్‌ చేయొచ్చా?

– వివాన్‌ కుమార్‌
ఎఫ్‌బీలో డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందలేం. రికవర్‌ చేయడం అసాధ్యం. కానీ, మొత్తం మెసేజ్‌లను archived messages, రూపంలో పొందొచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్‌ ఏ కాపీ’పై క్లిక్‌ చేయండి. మొత్తం ఫేస్‌బుక్‌ డేటా మెసేజ్‌లతో సహా కట్టిగట్టి డౌన్‌లోడ్‌ రూపంలో అందిస్తున్నారు. పాస్‌వర్డ్‌తో ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి పాత మెసేజ్‌లు అన్నింటినీ చూడొచ్చు.
* కొత్త భాషల్ని నేర్చుకునేందుకు తగిన యాప్‌ని సూచించగలరు?

– ఈమెయిల్‌
Verbling – Learn Languages యాప్‌ని ప్రయత్నించొచ్చు. హిందీతో పాటు స్పానిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, డచ్‌, ఇటాలియన్‌… లాంటి పలు దేశాల భాషల్ని సులభమైన పద్ధతిలో నేర్చుకునేందుకు వీలుంది. ఆన్‌లైన్‌ ట్యూటర్లూ యాప్‌లో ఉన్నారు. బ్రౌజ్‌ చేసి రివ్యూలు, రేటింగ్‌ల ద్వారా ఎవరు విపులంగా భాషని నేర్పుతున్నారో తెలుసుకోవచ్చు. Duolingo: Learn Languages Free యాప్‌ మరోటి. ఇదో ఉచిత సర్వీసు. ఇవే కాకుండా గూగుల్‌ ప్లే, ఐట్యూన్స్‌లో చాలానే యాప్‌లు ఉన్నాయి. సెర్చ్‌ ద్వారా వెతికి తగిన వాటిని ఎంచుకోండి.

– యశస్విన్‌ రెడ్డి, www.rdp.in