ఆఫీస‌ర్ పై దాడి ప‌వ‌న్ ప‌నే అంటున్నా రామ్ గోపాల్‌వ‌ర్మా

ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్లో పోస్ట్‌లు పెట్ట‌డం ఆఫ్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మా తాజాగా మ‌ళ్ళీ ట్వీట్లు చేయ‌డం ప్రారంభించారు .అయితే అప్ప‌ట్లో శ్రీ‌రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిట్టడం త‌నే ప‌నే అని ఒప్పుకున్నా వ‌ర్మా ,తాజాగా త‌న ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రో పొస్ట్ పెట్టారు ..అయితే నాగార్జునా హీరోగా వ‌ర్మా ద‌ర్శ‌క‌త్వంలో ఆఫీస‌ర్ సినిమా టీజ‌ర్ విడుద‌లైనా విష‌యం అంద‌రికి తెలిసిందే ,చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మా ,నాగార్జునా కాంభినేష‌న్‌లో వ‌స్తున్నా సినిమా కావునా ప్రేక్ష‌కుల‌లో భారి అంచ‌నాలే నెల‌కొన్నాయి .అయితే ఈ ఆఫీస‌ర్ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుద‌ల చేయ‌డంతో ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది .అయితే ఆఫీస‌ర్ సినిమాకు యూట్యుభ్‌లో వ‌చ్చిన లైకుల‌కు స‌మానంగా డిస్‌లైకులు రావ‌డంతో ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది . అయితే తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మా ఆఫీస‌ర్ సినిమాకు వ‌చ్చిన డిస్‌లైకుల‌కు సంబంధించి త‌న ట్విట్ట‌ర్‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టారు .ఆఫీస‌ర్ సినిమాలో డిస్‌లైకులు 11 వేలే వ‌చ్చాయ‌ని, 11కోట్ల తెలుగు వారిలో ఇంత‌మందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్సా అంటూ వ‌ర్మా, ప‌వ‌న్ పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసారు .ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ ఎంత‌మంది వుంటే అంత మంది ఆఫీస‌ర్ సినిమాపై డిస్‌లైకుల‌తో ఎదురు దాడి చేయండంటూ వ‌ర్మా త‌న ట్విట్ట‌ర్ ద్వారా పెర్కోన్నారు .అయితే ఆ మ‌ధ్య బ‌న్ని న‌టించిన దువ్వాడ జ‌గ‌నాథం సినిమా కూడ డిస్‌లైకుల విష‌యంలో కొత్త రికార్డే సృష్టించింది .అయితే ఆ రికార్డులు త‌న ఖాత‌లో వేసుకోవ‌డానికే వర్మా ఇలా చేస్తున్నాడంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ జోకులు వేసుకుంటున్నారు .ఏదేమైనా గాని ట్విట్ట‌ర్ ద్వారా పాపులారిటి సంపాధించ‌డంంలో వర్మా త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌డంలో ఏమాత్రం అతిశ‌యేక్తి లేద‌నే అనాలి .అయితే ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైనా హిట్ లేని వ‌ర్మా ఆఫీస‌ర్ సినిమాతో నైనా హిట్ కొడ‌తాడో తేదో చూడాలి మ‌రి .