ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆనం వివేకానంద రెడ్డి

 

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని చంద్రబాబుకు కిమ్స్‌ వైద్యులు వివరించారు.