ఇంటిని ఈ విధంగా క‌డితే మీరు ఆనందంగా వుంటారు

చాలా మంది త‌మ‌కు న‌చ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటారు .ఐతే అది ఎంత వ‌ర‌కు మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు .వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల వారికి ఆష్ట ఐశ్వ‌ర్యాలే కాదు మాన‌సిక ప్రశాంతత కూడ చేకురుతుంది . ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అవి వాస్తుపరమైన ఇబ్బందులేన‌ని మ‌నం ముందు గుర్తు చేసుకోవాలి . కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన త‌గిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది . ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలి.ఇంటి నిర్మాణం కోసం ముందుగా స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని తవ్వాలి. ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి. త‌ర్వాత నైరుతి దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకొవ‌డం వ‌ల్ల ఇల్లు త్వ‌ర‌గా నిర్మిత‌మ‌వ‌డ‌మనేది జ‌రుగుతుంది .వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలనేది వాస్తునిపుణులు వాద‌న .మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండకపోవడం అది మ‌న‌కు మేలు చేసే అంశమ‌నే చెప్పాలి . ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఎలాంటి కట్టడం నిర్మించొద్దు. ఇంటి స్థలానికి పడమరం వైపున్న గోడను ఆనుకుని ఎలాంటి కట్టడానికి సంబంధించిన గోడనైనా నిర్మించుకోవచ్చు. ఐతే ఈ భాగంలో పశువుల పాక, ధాన్యం నిల్వ చేసే గదుల నిర్మాణం అటువంటివి చేయ‌డం లాభదాయకం. కాకపోతే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పుదిశగా వాలుగా ఉండేలా చూసుకోవాలి . లేదంటే స్త్రీలలో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్ర‌మాద‌ముంది .కావునా ఇంటిని నిర్మించుకునే వ్య‌క్తులు పై విధంగా వాస్తుకు సంబంధించిన అంశాలు పాటిస్తే మీరు మీ ఇంట్లో సుఖ‌శాంతుల‌తో జీవించవ‌చ్చ‌ని వాస్తునిపుణులు అంటున్నారు .ఐతే వాస్తు నిపుణులు అనేవారిని చూసి ఎన్నుకోవ‌డం మంచిది .చాలా మందికి వాస్తు గురించి తెలియ‌కపోయిన వాస్తు గురించి వివ‌ర‌స్తూ వుంటారు . ఐతే ఈ విష‌యంలో కొంచెం జాగ్ర‌త్త ప‌డ‌డం మేలు .