ఉద్యోగీగా ఉంటూ రాజ‌కీయాల్లో పాల్గోన‌డం సిగ్గు చేటు

ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి అనే వాడు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నేది మ‌నం రాసుకున్నా చ‌ట్టంలోనే ఉంది .ఐతే ఇప్పుడు మ‌న ఆంధ్రాలోని కొంద‌రు ఉద్యోగులు ఇవేమి తేలియ‌వ‌నే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు . తాజాగా ఏపి ఎన్జివో అధ్య‌క్షుడు అశోక్ బాబు కూడా అలానే ప్ర‌వ‌ర్తించారంటూ బీజేపి నేత‌లు ఆరోపిస్తున్నారు . తాజా స‌మాచారం ప్ర‌కారం క‌ర్ణాట‌క ఎన్నిక‌లో కాంగ్రేస్ త‌రుపునా ప్ర‌చారం చేయ‌డానికి ఎన్జీవో అధ్య‌క్షుడు అశోక్ బాబు అక్క‌డికి వెళ్ళాడ‌ని త‌మ ద‌గ్గ‌ర సాక్ష్యాలు వున్నాయంటూ బీజేపి నేత‌లు అంటున్నారు .ఐతే దీనిపై ఇప్పుడు ఏపి లో తీవ్ర దుమారం రేగుతుంది .ఉద్యోగ సంఘాల అధ్య‌క్షుని హోదాలో ఉంటూ ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి . ఐతే రాజ‌కీయంలోకి వెళ్ళాల‌ని ఆలోచ‌న వుంటే ఉద్యోగానికి రాజినామ చేసి త‌న వ్య‌క్తిగ‌తంగా వెళ్ళితే భాగుంటుంది కాని ఇలా వెళ్ళ‌డం ఎంత మాత్రం స‌మంజ‌సం కాదు .ఒక ఉద్యోగి అనే వాడు చ‌ట్టంలో ఉన్న ప‌రిమితి మెర‌కు న‌డుచుకోవాల‌నే నిబంద‌న‌ను, తుంగ‌లో తోక్కే ప్ర‌య‌త్నం చేస్తే, చూస్తు ఎవ్వ‌రు ఊరుకోరు అనే విష‌యం తెలుసుకోవాలి .చ‌ట్టం అనేది అంద‌రికి స‌మానం అది ఎవ‌రి చుట్టం కాద‌నే విష‌యం కూడా కొంద‌రు గ్ర‌హిస్తే మంచిది . ప్ర‌భుత్వ జీతం తీసుకుంటున్న‌ది నువ్వు చేస్తున్నా ప‌నిని క‌రెక్ట‌గా చేయ‌మని కాని రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌చారం చేయ‌మ‌ని కాద‌నే విష‌యం ఎంత ఎక్కువ‌గా తెలుసుకుంటే అంత మంచిది .నువ్వు రాజ‌కీయ ల‌బ్ధి పోందాలంటే ఉద్యోగానికి రాజీనామ చేసి వెళ్ళితే నిన్ను విమ‌ర్శించే వారు ఎవ్వ‌రు ఉండ‌రు . ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల ద్వారానే నీ నేల జీతం ఆధార‌ప‌డి ఉంద‌ని మ‌ర‌చి పోవ‌ద్దు .ఒక వ్య‌క్తికి స్వేచ్చ‌గా జీవించే హ‌క్కు ,త‌న‌కు న‌చ్చిన వాళ్ళ‌కు స‌పోర్ట్ చేసే హ‌క్కు ఉంది .కాని అవ‌న్ని చ‌ట్ట‌నికి లోబ‌డే అని మ‌ర‌చిపోవ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు .మ‌నం అభివృద్ది చెందుతున్నా స‌మాజంలో బ‌తుకుతున్నాం ,ఆ అభివృద్ది అనేది మీలాంటి ఉద్యోగుల చేతులో బ‌లి కావ‌డం దేశానికే అవ‌మానం .మ‌నం చ‌దువుకుంది మంచి చేయ‌డానికే కాని ప్ర‌జ‌ల‌ను త‌ప్పు ద్రోవ ప‌ట్టించడానికి కాద‌ని ,ఇక‌నైనా దానికి త‌గ్గ‌ట్టు మ‌సులు కోవ‌డం ఉత్త‌మం.