ఉపముఖ్యమంత్రి పదవి నా కోరిక కాదు..

ఆ పదవిపై ఆసక్తి లేదు : శ్రీరాములు

ఉప ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష తనకు లేదని బీజేపీ నేత శ్రీరాములు స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని వదంతులు సృష్టించారని, ఉపముఖ్యమంత్రి పదవిపై తనకు ఆసక్తి లేదని ఆయన చెప్పారు. బాదామిలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేసిన శ్రీరాములుకు పార్టీ అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయం తెలిసిందే.

యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావాలనే తామంతా కోరుకుంటున్నామని, పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంగీకరిస్తానని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ఎన్నికలు జరిగిన 222 స్ధానాలకు గాను బీజేపీ 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, కాంగ్రెస్‌ 74 స్ధానాల్లో, జేడీఎస్‌ 39 స్ధానాల్లో, ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.