ఎన్టీఆర్ కూడ చ‌ర‌ణ్ బాట‌తోనే న‌డుస్తున్నాడా

 

మ‌న తెలుగిండ‌స్ట్రీలో ఎదైనా ఒక జోన‌ర్లో సినిమా విడుద‌లై హిట్ కొట్టిందంటే చాలు అదే జోన‌ర్ లో చాలా సినిమాలు తెర‌కెక్కుతాయి .ఇప్పుడు మ‌న తెలుగిండ‌స్ట్రీలో అదే ప‌రిస్థితి క‌న‌బ‌డేలా క‌నిపిస్తుంది .ఈ మ‌ధ్య ప‌ల్లేటూరి నేప‌ద్యంలో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమా మంచి హిట్ ను కొట్టి భారి విజ‌యం సాధించింద‌ని అంద‌రికి తెలిసిందే .తాజాగా ఇదే బాట‌లో ప‌లు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి అని తాజ స‌మాచారం .అయితే ఒక పెద్ద సినిమా కూడ ప‌ల్లేటూరి నేప‌ద్యంలో తెర‌కేక్కుతుంద‌ట ,అదే మ‌న ఎన్టీఆర్ ,త్రివిక్రం , కాంబినేష‌న్‌లో వ‌స్తున్నా సినిమా కూడ ప‌ల్లేటూరి క‌థ‌తోనే ప్రేక్ష‌కుల‌ను అలంరించ‌బోతుంద‌ట ,ప్ర‌స్తుతం ఈ మూవి కొసం రామోజీ ఫిలిం సిటీలో సీమ ప‌ల్లేటూరికి సంబంధించిన సెట్‌ను వేస్తున్నార‌ట ,దీంతో ఎన్టీఆర్ ,త్రివిక్రం కాంభీనేష‌న్‌లో వ‌స్తున్నా సినిమా ప‌ల్లేటూరి నేప‌ద్యం లో వ‌స్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది . త‌మ‌న్ స్వ‌రాలందిస్తున్నా ఈ సినిమాను అభిమానులుTTT అంటూ ప్రేమ‌గా పిలుచుకుంటున్నా సంగ‌తి అంద‌రికి తెలిసిందే క‌దా .,అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో మంచి ఫామ్‌లో వున్నారు .త్రివిక్రంకు కూడ తెలుగు ఇండ‌స్ట్రీలో భారి హిట్ ను సాధించిన అత్తారింటికి దారేది వంటి సినిమా తీసిన అనుబ‌వం కూడ వుంది .ఇంత‌కు ముందు ఎప్పుడో రావాల్సిన వీరిద్ద‌రి కాంభినేష‌న్ ఇప్పుడు సెటైంది . త‌న మాట‌లతో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచే ద‌ర్శ‌కుడు త్రివిక్రం అంటే అందులో ఎలాంటి సందేహం వుండ‌దు ,అలాంటి ద‌ర్శ‌కుడితో ఎలాంటి డైలాగ్‌నైన త‌న నోటితో ప‌లికించి ప్రేక్ష‌కుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టించే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తుండ‌డంతో అంచ‌నాలు భారిగానే వుంటాయ‌ని చెప్పాలి . ఇప్పుడు ఎన్నో అంచ‌నాలతో షూటింగ్ జ‌రురుకుంటున్నా ఈసినిమా రేపు ఏ రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందో చూడాలి మ‌రి .