ఎలక్ట్రిక్ వాహనాల వ‌ల్ల విద్యుత్‌ ఉత్పత్తి పెంచడం : చంద్రబాబు

రాష్ట్రంలోని 24 వేల సోలార్ పంపుసెట్లను గ్రిడ్‌కు అనుసంధానించాలని… దీంతో అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి పెంచడం ద్వారా యూనిట్ విద్యుత్ ధరను రూ. 5.50 నుంచి రూ. 3.75కు తగ్గించగలిగామని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. చెత్తను సేకరించేందుకు ప్రస్తుత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.