ఎల్‌ అండ్‌ టీ మెగా బై బ్యాక్‌ చరిత్రలో తొలిసారి

దేశీయ ఇంజనీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టి) వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు (బై బ్యాక్‌)కు చరిత్రలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో బై బ్యాక్‌ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని వాటాదారులకు గుడ్‌ న్యూస్‌ అందించింది. రూ. 9వేలకోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్‌ ఆఫర్‌ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది.

వాటాదారులు కంపెనీ పట్ల చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని ఎల్ అండ్ టి ఛైర్మన్‌ ఏఎం నాయక్ చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేరువిలువు 1500రూపాయల వద్ద సుమారు 6వేల షేర్లు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎల్‌ అండ్‌టీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్‌ అండ్‌ టీ షేరు ధర మంగళవారం నాటి ముగింపు రూ.1,322 తోలిస్తే 13శాతం ఎక్కువ.దీంతో ఫ్లాట్‌మార్కెట్‌లో ఈ కౌంటర్‌ 2 శాతం లాభాలతో కొనసాగుతోంది.