కర్నాటక ఎన్నికల విజ‌యం తెల్చి చెప్పిన ఇంటెలిజెన్స్‌..

ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇదే..!

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ సర్వశక్తులు ధారపోస్తుండగా కాంగ్రెస్‌ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాదని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు మదింపు వేశాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాలు మొత్తం 224 నియోజకవర్గాలనుంచి తాజాగా సేకరించిన వివరాల ప్రకారం కాంగ్రెస్‌కు 105లోపు మాత్రమే స్థానాలు దక్కనున్నాయి. బీజేపీకి 90వరకు స్థానాలు లభిస్తాయి. ఇక జేడీఎస్‌ గరిష్టంగా 40కు మించి స్థానాలు గెలవబోదని ఈ వర్గాలు తేల్చివేశాయి.

మే మొదటివారంలో నిర్వహించిన సర్వే కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. ప్రధానిమోదీ వరుస సభలతో అమాం తం పెరిగిన బీజేపీ గ్రాఫ్‌ తిరిగి సోనియాగాంధీ, రాహుల్‌ల పర్యటనతో ఒకింత తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని లోకనీతి – సిఎ్‌సడిఎస్‌ – ఏబీపీ న్యూస్‌ సమీక్ష కూడా పేర్కొంది. ఏప్రిల్‌ రెండోవారంలో 85-91 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌ మేమొదటివారం నాటికి 92 -102 స్థానాలకు పెరిగిందని సమీక్ష పేర్కొంది. అలాగే ఏప్రిల్‌ నెలలో 89-95 స్థానాల వద్ద నిలిచిన బీజేపీ మే మొదటివారం నాటికి 79-89 కి పడిపోయినట్లు పేర్కొంది.