కార్యకర్తల సమస్యల‌పై చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

అరకులోయ : సమస్యలు పరిష్కారం కోసం విశాఖలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసిన సంఘటనకు నిరసనగా అరకులోయ పట్టణంలో సీఐటీయూ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇక్కడి నాలుగురోడ్ల జంక్షన్‌లో రాస్తారోకో చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు.

అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, మహిళలపై పోలీసు ల లాఠిచార్జీ సంఘటనను అన్ని వర్గాల ప్రజ లు ఖండించాలని నినదించారు. సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు, సంఘ నేతలు మణి, పి.విమల, నిర్మల, భాను, జానకి పాల్గొన్నారు.