కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని..

కొడుకు పాఠశాలకు వెళ్లకుండా జులా యిగా తిరుగుతున్నాడని మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాదవనగర్‌ ప్రాంతం భగత్‌సింగ్‌ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అలివేలుమంగమ్మ(38)కు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు సోమశేఖర్‌ ఉన్నారు. సోమశేఖర్‌ స్థానిక పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. అతడు జులాయిగా తిరుగుతుండటంతో మందలించినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న సీఐ మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.