కొలెస్ట్రాల్ త‌గ్గించుకునే ప‌ద్ధ‌తులు

శ‌రీరంలో కొవ్వు పెర‌గ‌డం వ‌ల‌న మ‌నిషి అనారోగ్య ప‌రిస్థితులు ఎదుర్కోవ‌ల‌సి వుంటుంద‌ని డాక్ట‌ర్లు చెప్పుతున్నారు.అయితే ఇటువంటి చెడు కొలెస్ట్రాల్ ను మ‌న ద‌రికి చేర‌నివ్వ‌దంటే కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది .అయితే తాజా పండ్లు ,కూర‌గాయ‌లు ,చేప‌లు ,వాల్న‌ట్స్ ,తృణ దాన్యాలు వంటి వాటిని తీసుకుంటే మేలు చేసే కొవ్వు మ‌న శ‌రిరానికి అందుతుంది త‌ప్ప ఎలాంటి హాని క‌ర‌మైనా కొవ్వుఅనేది పెర‌గ‌దు ,కాఫీ ,టీ అటువంటి పానీయాల‌కు వీలైనంతా దూరంగా ఉండ‌డం మంచిది .వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక కొవ్వు అనేది మ‌న శ‌రీరంరంలో పేరుకు పోవ‌డానికి తోడ్ప‌డుతుంది .అయితే వ్యాయామమం లాంటివి చేయ‌డం వ‌ల‌న శ‌రీరంలోని కొవ్వును కొంత మెర త‌గ్గించుకోవ‌చ్చు ,మ‌నం రోజు తినే ఆహారంలో ఓట్స్ ,బీన్స్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవడం , .ఎక్కువగా పీచు ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డ‌డం మ‌న ఆరోగ్యానికి మంచిదని చెప్ప‌వ‌చ్చు .ఒత్తిడి ,కోపం అనేవి ఎంత మెర త‌గ్గించుకుంటే అంత మంచిదంటూన్నారు డాక్ట‌ర్లు ,.కోపం, ఒత్తిడి వ‌ల్ల మ‌న‌కు తెలియ‌కుండానే అధికంగా తిన‌డం జ‌రుగుతుంది .దీంతో మ‌న శ‌రీరంలో కొవ్వు ఎర్పాడే ప్ర‌మాదం కూడ ఉంది .అయితె ఆఫిల్ వంటి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న చెడు కొలెస్ట్రాల్ అనేది త‌గ్గించి శ‌రీరాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది .పైనా చెప్పిన చిట్కాలు పాటిస్తే శ‌రీరంలో కొలెస్ట్రాల్ అనేది చెర‌కుండా మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు .