కోటి రూపాయల ప్యాకేజీ వ‌దిలి : కోచింగ్‌ లేకుండా24వ ర్యాంకు

ఓవైపు మల్టీనేషన్‌ కంపెనీ (ఎంఎన్‌సీ)లో ఏడాదికి కోటి రూపాయల జీతం. మరోవంక అనుకున్న లక్ష్యం సాధించాలనే సంకల్పం. భారీ జీతం కంటే లక్ష్యం వైపే మొగ్గు చూపి.. కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించాడు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్‌. ముంబైలో ఎలక్టిక్రల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత సామ్‌సంగ్‌ కంపెనీలో ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఏడాదిపాటు ఉద్యోగం చేశాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సివిల్స్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు. పట్టుదలతో చదివి ప్రతిభ కనబరచాడు. చిన్నప్పటి నుంచే చదువులో పృథ్వీ మంచి ప్రతిభ కనబరచేవాడని ఆయన తండ్రి యిమ్మడి శ్రీనివాసరావు, తల్లి రాణి తెలిపారు.