క‌ర్ణాట‌క ఎన్నిక‌లో ఆ గ్రామం ….

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు అనేవి ఇప్పుడు రెండు జ‌తీయ పార్టీల ప్ర‌తిష్ట ,గౌర‌వానికి సంబంధించిన‌దిగా చెప్పుకోవాలి . ఎందుకంటే ఆ పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను అంత సిరియ‌స్గా తీసుకున్నాయి .దీంతో ఇప్పుడు కర్ణాటక ఓటరు తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆ రాష్ట్రంలోని ఓ గ్రామం మాత్రం ఎన్నికలను బహిష్కరించి ఓటింగ్‌కు దూరంగా ఉంది. అందుకు బలమైన కారణమే ఉందంటూ ఇక్క‌డి ఓట‌ర్లు చెప్పుతున్నారు . ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ ఊరుకు గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం లేదని వాళ్లు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కల్బురగి జిల్లా చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామవాసులు.. తాజాగ జరుగుతున్న శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ ఊరుకు గ్రామ పంచాయతీ భవనం కట్టించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నామని, కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆ గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ భవనం కట్టించే వరకూ ఓటేయబోమని చెబుతున్నారు. గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉండగా.. మెజార్టీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామానికి నేటి వరకూ పంచాయతీ భవనమే లేదంటే.. ఆ ఊర్లో అభివృద్ధి ఏ తీరున ఉందో అర్థం చేసుకోవచ్చు.పోలింగ్లో పాల్గోనండి అంటూ చెప్పె అధికారులు వాళ్ళ స‌మ‌స్య‌లు కూడ ప‌రిష్క‌రించండి అంటూ చెప్తే భాగుంటుందంటూ ఆ ఊరిలోని గ్రామ‌స్థులు అంటున్నారు .ఎవ‌రైనా స‌రే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళ గ్రామం భాగుంటుంద‌నే క‌దా కాని ఎలాంటి అభివృద్ది నోచుకోన‌ప్పుడు వాళ్ళు ఓట్లు వేసిన ఏం ప్ర‌యోజ‌నం ఉండ‌దు . దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వాళ్ళ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దిశ‌గా అడుగులు వేస్తే ఇలాంటివి మ‌ళ్ళి రీపీట్ అవ్వ‌వు అనేది అర్థం చేసుకోవాలి .