గోదావ‌రి జిల్లాలోకి రాగానే బీభ‌త్స‌మే

జ‌గ‌న్ పాద‌యాత్ర కృష్ణా జిల్లాలో పూర్త‌యి గోదావ‌రి జిల్లాల్లోకి రాగానే ఏం జ‌రుగుతుంద‌నేదే ఇప్పుడు అంతుచిక్క‌ని అంశం. ఇప్ప‌టికే ఊహించ‌ని రీతిలో జ‌గ‌న్ యాత్ర‌కు స్పంద‌న వ‌స్తుంది. జ‌గ‌న్ వెన‌క న‌డుస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. పార్టీలో చేరిక‌లు మొద‌ల‌య్యాయి. ఒక‌ప‌క్క బీజేపీ నేత‌లంతా క‌మ‌లం పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కొంద‌రు టీడీపీ సీనియ‌ర్లు కూడా… గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ చేసే సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్దతు ప‌లికి… వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌లు… వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. అందుకే గోదావ‌రి జిల్లాలోకి వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎంట‌ర్ కాగానే భారీ మార్పులు చేర్పులు జ‌రుగుతాయ‌నేది ఆ జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుల అభిప్రాయం.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… గోదావ‌రి జిల్లాలు అంటేనే పొలిటికల్ డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్స్‌కు చిరునామా. ఈరెండు జిల్లాలు ఏపీలోనే పెద్ద‌వి కావ‌డంతో… ఇక్క‌డ ఓట‌ర్లు ఏ పార్టీకి మొగ్గు చూపితే… ఆపార్టీయే దాదాపుగా అధికారంలోకి వ‌చ్చే చాన్స్ ఉంటుంద‌నే విశ్లేష‌న‌లు ఉన్నాయి. దీంతో పాటుగా కాపు, క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడా… ఈ ప్రాంతంలో ఎక్కువ‌గా ఉంటారు. వీరిని ప్ర‌స‌న్నం చేసుకుంటేనే… ఓటు బ్యాంకు నిల‌బడుతుంది. వీరికి ఇచ్చే హామీల ఆధారంగానే ఓట్లు డిసైడ్ అవుతాయి. ఇప్ప‌టికే ఒక్కో జిల్లాలో ఒక్కో హామీని ఇచ్చుకుంటూ వ‌స్తున్న జ‌గ‌న్‌.. ప్ర‌తి ప్రాంత ప్ర‌జ‌ల మ‌న‌సులో స్థానం సంపాదించేస్తున్నారు. ఇదే ఊపులో గోదావ‌రి జిల్లా వాసుల‌కు సైతం జ‌గ‌న్ ద‌గ్గ‌రైతే… ఇక అంతే సంగ‌తులు. ఖ‌చ్చితంగా అధికారం జ‌గ‌న్ సొంతం అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.

ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ బేరీజు వేసుకుని… టీడీపీ ఇప్పుడు ఆందోళ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తుంది. జ‌గ‌న్‌కు వ‌స్తున్న ఐడియాలు మ‌న‌కెందుకు రావ‌డం లేద‌ని.. ఇప్ప‌టికే త‌మ్ముళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితిలో… జ‌గ‌న్ నోటి వెంట వ‌చ్చే హామీని ముందుగానే ఊహించే ప‌నిలో ప‌డింది టీడీపీ. మ‌రి గోదావ‌రి జిల్లాల్లో జ‌ర‌గ‌బోయే బీభ‌త్సాన్ని… టీడీపీ ఎలా త‌ట్టుకోగ‌ల‌దో వేచిచూడాలి.