చంద్ర‌బాబు కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టేస్తున్న బీజేపీ నేత‌లు

ఒక‌రు ధ‌ర్మ పోరాట దీక్ష చేస్తే… మ‌రొక‌రు వంచ‌న దీక్ష చేస్తున్నారు. ఒక‌రు తిరుప‌తిలో కూర్చుంటే… ఇంకొక‌రు విశాఖ‌లో కూర్చుంటున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీలు… ఒక‌రిపై మ‌రొక‌రు యుద్దానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సై అంటే సై అంటున్నారు. చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తున్నారు. అయితే చంద్ర‌బాబు… జ‌గ‌న్‌ను కాపీకొడుతున్నారంటూ బీజేపీ నేత‌లు సైతం మండిప‌డ‌టం ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసినట్లే.. చంద్రబాబు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేసింది ధర్మపోరాట దీక్ష కాదని.. అధర్మ పోరాటం అన్నారు.

అంతేకాదు బీజేపీ కొన్ని నిజాల‌ను సైతం వెలుగులోకి తెస్తుంది. ఎలాగూ వీరిద్ద‌రి మ‌ధ్య బంధం తెగిపోయింది క‌దా అని… చంద్ర‌బాబు అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌పెట్టేస్తున్నారు. జ‌గ‌న్ ఏం చేస్తాడో తెలుసుకుని ముందుగా అదే చేయ‌డం చంద్ర‌బాబు ప‌ని అని కొంద‌రు… హోదా రాద‌ని తెలిసి కూడా ప్ర‌జ‌ల‌ను మ‌బ్య‌పెట్ట‌డానికే దీక్ష‌ల‌కు దిగుతున్నార‌ని ఇంకొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతుంద‌ని కూడా బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. జగన్ ఏది చేస్తే చంద్రబాబు అది చేస్తున్నారని… ఆయన కాపీ ఉద్యమమని విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. చంద్రబాబు సైకోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. మొత్తానికి బీజేపీకి టీడీపీకి మ‌ధ్య వైరం చెడిపోవ‌డంతో… ఆరోపణ‌లు విమ‌ర్శ‌ల ప‌ర్వం ముదిరిపాక‌న ప‌డుతుంది. ఈ యుద్ధం వెన‌క అస‌లు ఆంత‌ర్యం ఏంట‌నేది ప‌క్క‌న పెడితే… 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు అయోమ‌యంగా మారింది.