చైనాలో ఘనవిజయం.. ‘బాహుబలి 2’

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్‌ వండర్‌ బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్‌ లో రిలీజ్‌ అయిన బాహుబలి 2కి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. మే 4న ఈ సినిమా చైనాలోనూ భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది.

బాహుబలి 1.. చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో రెండవ భాగం విషయంలో మరింత శ్రద‍్ధ తీసుకొని పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో బాహుబలి 2 సినిమాను చైనా రిలీజ్‌ కోసం రీ ఎడిట్‌ చేసి సిద‍్ధం చేశారు. బాహుబలి 2 చైనాలో సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకోనుంది. చైనాలోని ఐమాక్స్‌ స్క్రీన్స్‌ మీద రిలీజ్‌ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి 2 రికార్డ్‌ సృష్టించనుంది.మరి బాహుబలి ఈ సారైన చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడతాడేమో చూడాలి.