జంబ‌ల‌క‌డి పంబ నా స్టోరే

లకిడిపంబ టైటిల్ వినగానే పాతికేళ్ల క్రితం హాస్య దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా తప్పకుండా గుర్తొస్తుంది. ఆడవాళ్లు మగవారిగా.. మగవాళ్లు ఆడవారిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా కామెడీ చిత్రాల్లో మైలురాయిలా నిలిచిపోయింది. అప్ప‌ట్లో కామెడి చిత్రాల‌లో ఒక కొత్త ట్రెండ్‌నే సెట్ చేసింది . ఇన్నేళ్ల తరవాత అదే టైటిల్ తో ఓ సినిమా వస్తోంది. శ్రీనివాసరెడ్డి హీరోగా నటిస్తున్న ఈ మూవీతో మురళీకృష్ణ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. జంబలకిడిపంబ టైటిల్ పెట్టినా ఆ మూవీ స్టోరీతో ఎలాంటి లింకు లేదని డైరెక్టర్ తెలిపారు . కొన్ని విచిత్ర పరిస్థితుల మధ్య మొగుడు పెళ్లాం లాగా.. పెళ్లాం మొగుడిలాగా ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నదే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్నీగా ఉండేలా తమ జంబలకిడిపంబ ఉంటుందని చెప్పుకొస్తున్నారు . ‘‘నా రియల్ లైఫ్ లోని ఇన్సిడెంట్లనే ఈ సినిమా బేసిక్ ఐడియాగా తీసుకున్నానంటూ ద‌ర్శ‌కుడు అన్నారు . నాది లవ్ మ్యారేజీ. అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే వచ్చే కష్టాలు చాలానే ఉంటాయని తరవాత అర్ధమైంది. అప్పటి నా పరిస్థితులనే స్టోరీ లైన్ గా మార్చి ఈ సినిమా తీశాను’’ అంటూ డైరెక్టర్ మురళీకృష్ణ ఈ మూవీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చారు .ఈ సినిమాతో సిద్ధి ఇద్నాని అనే గుజరాతీ భామ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సిద్ధి గుజరాతీ స్టేజ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమెకు తెలుగు కొత్తయినా నటించడం పెద్ద ప్రాబ్లెమ్ కాలేదట. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు. గ‌తంలో ఆడ‌వాళ్ళు మ‌గ‌వాళ్ళైతే ఎలావుంటుందో చూసిన ప్రేక్ష‌కులు అదే టైటిల్‌తో వ‌స్తున్నా సినిమా కాబ‌ట్టి ప్రేక్ష‌కుల‌లో కొంత ఆస‌క్తి అనేది