జమ్మూకశ్మీర్‌లో సమంత పుట్టిన రోజు వేడుకలు

అక్కినేని వారి ఇంట కోడలిగా అడుగుపెట్టిన సమంత శనివారం తన తొలి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. రంగస్థలం సక్సస్‌తో పాటు, సావిత్రి బయోపిక్‌ మహానటి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సమంతకు ఈ బర్త్‌డే ఎంతో ప్రత్యేకంగా మారింది. వారం ముందు నుంచే స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొలీగ్స్‌తో కేక్‌ కట్‌ చేసి ఎంజాయ్‌ చేసిన సమంత, నేడు( తన 31వ బర్త్‌డే రోజు) నాగ చైతన్యతో కలిసి జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ వెళ్లింది.

అక్కడి అందమైన ప్రదేశాలను చూస్తూ ఈ జంట ఎంజాయ్ చేస్తోంది. అక్కడి తన అనుభవాల గురించి చెబుతూ ‘స్వర్గంలో అడుగుపెట్టా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో పాటు తన హోటల్ గది నుంచి తీసిన ఫోటోను కూడా సమంత షేర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ ‘ది కైబర్‌ హిమాలయన్‌ రిసార్ట్‌ అండ్‌ స్పా’లో స్టే చేస్తున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్‌డే ఇదే కావడం విశేషం.