టీచర్ల పోస్టుల పేరుతో మోసపూరిత ప్రకటనలు టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేత పేర్ని నాని విమర్శలు.

చంద్రబాబు నిరుద్యోగులను విద్యార్ధులను రైతులను డ్వాక్రా మహిళలననే కాకుండా టీచర్లను కూడా మోసంచేశారని వైసీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. చదువు చెప్పే గురువులకు అబద్దం చెప్పకూడదని కానీ అలాంటి వారికే అబద్దాలు చెప్పి మోసం చేసి వేధిస్తున్నారన్నారు. ఏపీలో 22వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉంటే.. 10వేలు పోస్ట్లు ఇస్తున్నామని చెప్పికూడా మోసం చేశారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ కుట్ర పూరితమే అన్నారు.