టీడీపీ నాయకుల తీరుపై ఘట్టమనేని ఆదిశేషగిరి రావు విమర్శలు గుప్పించారు.

 

టీడీపీ నాయకుల తీరుపై వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం విజయవాడలోని పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఘట్టమనేని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం.. రాష్ట్ర ప్రయోజనాలు కాదని వైఎస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు రాత్రిపూట ఎంత మంది బీజేపీ నేతలను కలుస్తున్నారని ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ప్రశ్నించారు.