తమిళ దర్శకుడుతో లవ్ లో ఉన్న…నయనతార

నయనతారకు ప్రపోజ్‌ చేసిన విగ్నేశ్ శివన్‌‌

ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌, కథానాయిక నయనతార ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ వియారయాత్ర నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి ఫొటోలను విగ్నేశ్‌ పోస్ట్‌ చేస్తూ తన ‘తార’తో కలిసి సరదాగా ఎంజాయ్‌ చేసినట్లు పేర్కొన్నారు. నయన్‌ కూడా ఓ కార్యక్రమంలో విగ్నేశ్‌ను ‘కాబోయే భర్త’ అని వ్యాఖ్యానించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు నిజమయ్యాయి. తాజాగా విగ్నేశ్‌ శివన్‌ సోషల్‌మీడియాలో పెట్టిన్‌ పోస్ట్‌ చూస్తే త్వరలో ఇద్దరూ పెళ్లి పీటలెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

నయన్‌, విగ్నేశ్‌లు నల్ల టోపీలు పెట్టుకుని దిగిన ఫొటోను విగ్నేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..‘హే..నాకు పెళ్లి వయసు వచ్చింది. నీకోసం ఎదురుచూడనా?’ అని తమిళంలో క్యాప్షన్‌ ఇచ్చారు. నిజానికి ఈ పదాలు నయన్‌ నటిస్తున్న సినిమాలోని ఓ పాటలోనివి. ఆమె ‘కొలమావు కోకిల’ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ‘కల్యాణ వయసు..’ అనే పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలోని లిరిక్స్‌ను పోస్ట్‌ చేస్తూ విగ్నేశ్‌ పై విధంగా ట్వీట్‌ చేశారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో ఇద్దరూ ఓ ఇంటివారయ్యేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగులో ‘జై సింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గురువుగా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.