తాజా స‌ర్వేలు కాంగ్రేస్‌కు ద‌డ పుట్టిస్తున్నాయా

క‌ర్ణాట‌క ఎల‌క్ష‌న్‌లో గెలుపు కొసం ఇరుపార్టీలు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే , .అయితే ఇన్ని రోజులు కాంగ్రేస్‌కు అనుకూలంగా ఉన్నా స‌ర్వేలు తారుమారు అయ్యే ప‌రిస్థితికి చెరుకున్నాయంటూ ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది .ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్నా కాంగ్రేస్ పార్టీ మ‌ళ్ళీ అధికారం చెప‌ట్టాల‌ని చూస్తుంది . బిజేపి కూడ అదికారంలోకి రావాడాని ఒట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డింది .అయితే పోయిన ఎల‌క్ష‌న్‌లో బిజేపి రెండు ముక్క‌లుగా చీలి పోవ‌డంతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ,ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదంటూ ,మే 12న జ‌రిగే ఎన్నిక‌లో బిజేపి విజ‌యం కాయ‌మ‌ని ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు జోస్యం చెప్పుతున్నారు .ప్ర‌ధాని మోడీ ఇంకా పూర్తి ప్ర‌చారంలోకి దిగ‌లేద‌ని దిగితే మ‌రిన్ని ఫ‌లితాలు తారుమారు అవుతాయంటూ బిజేపి పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు . బిజేపికి ప‌ట్టున్నా ముంబాయి -క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతంలోని బెళ‌గావి,గ‌ద‌గ ,హ‌వేరి ,ధార్వాడ జిల్లాలోని నియేజ‌క‌వ‌ర్గంలోని మొత్తం 50 స్థానాల‌లో బిజేపి అధికంగా గెలుచుకుంటుంద‌ని కొన్ని స‌ర్వేలలో వెలువ‌డింది .అయితే పొయిన ఎల‌క్ష‌న్‌లో బిజేపి పార్టీ చీలిపొవ‌డంతో అక్క‌డ కాంగ్రేస్ పార్టీకి అధిక స్థానాలు వ‌చ్చాయ‌ని ఇప్పుడు ఆ ప్రాతంలో బిజేపి బ‌లం పుంజుకుందని ,ముంబాయి – క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు ప్రాంతంలోని మొత్తం 50 స్థానాలలో బిజేపి 27 కాంగ్రేస్ 21 జేడిఎస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది అంటూ స‌ర్వేలో వెల్ల‌డైంది . అయితే కాంగ్రేస్ పార్టీ మాత్రం ఇవ‌న్ని బిజేపి వాళ్ళు రాసుకున్నా స‌ర్వేల‌ని, ఓట‌మి భ‌యంతోనే ఇవ‌న్ని చేస్తున్నార‌ని కొట్టిపారేసింది .మేము అధికారంలో వున్న‌పుడు ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని బిజేపి వాళ్ళు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేసిన మళ్ళీ అధికారం చెప‌ట్టేది కాంగ్రేస్ పార్టీ అంటూ ఆ పార్టీలోని నాయ‌కులు చెప్పుకొచ్చారు .