తోలి ప్రేమ‌క‌థ చెప్పిన ఎమ్‌స్ ధోని

ఎమ్‌స్ ధోని … ఓక‌ప్పుడు టీ మిండియాకు అద్బుత‌మైనా విజ‌యాలు అందించాడ‌నే చెప్పాలి .తాజాగా ఐపిఎల్‌లో కూడ త‌న హ‌వా కొన‌సాగిస్తున్నారు. కెప్ట‌న్‌గా ప‌క్క‌కు త‌ప్పుకున్నా త‌న‌లో బ్యాటింగ్ చేసే స‌త్తా ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నారు .ఐతే తాజాగా ప్ర‌మోష‌న్ ఇక ప్ర‌మోష‌న్ ఈవెంట్‌కు హాజ‌రైనా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన తొలి ప్రేమ గురించి ఈ స‌మావేశంలో చెప్పారు .ఐతే ఈ విషయాన్ని తన భార్య సాక్షి వద్ద చెప్పకండి అంటూ చెప్తు అక్క‌డున్నా వారంద‌రి ముఖంలో న‌వ్వు తెప్పించారు . టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత విషయాలను అంతగా బయటపెట్టేందుకు ఇష్టపడరు . అలాంటి వ్యక్తి.. ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో తన తొలి ప్రేమ గురించి చెప్పడం అందరికీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది .ధోని త‌న ప్రేమ గురించి తెలుపుతూ ,ఆ అమ్మాయి పేరు స్వాతి అని.. 12వ తరగతిలో ఉన్నప్పుడు చివరిసారిగా కలిశానని చెప్పారు . ఐతే తాను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఈ తొలిప్రేమ చిగురించిందని, ఆ ఏడాదే ఆమెను చివరి సారి చూశానని.. ఆ తర్వాత ఆమెను ఎప్పుడూ చూడలేదని చెప్పారు .ఈ కార్యక్రమానికి ఎమ్‌స్ ధోనితో స‌హా చెన్నై ఆటగాళ్లు షేన్‌వాట్సన్, సురేశ్ రైనా, రవీంద్రజడేజా కూడా హాజరయ్యారు. కాగా ధోనీ సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన జీవితంలో మరో ప్రేమకథ కూడా ఉందని తాజాగా ధోనీ తెలిపారు . ఐతే ఇప్పుడు ఈ ప్రేమ క‌థ‌ను ధోని త‌న భార్య సాక్షికి తానే చెపుతారా లేక మిడియా ద్వారా తెలుసుకుంటుందా అంటూ కొంద‌రు ఛ‌లోక్తులు వెసుకుంటున్నారు .ఏదేమైనా కాని టీమిండియా మాజీ కేప్టేన్ ధోని త‌న తోలి ప్రేమ గురించి చెప్ప‌డం ధోని అభిమానుల‌కు సంతోషానిచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు .తాజాగ జ‌రుగుతున్నా ఐపిఎల్‌లో ధోని త‌న జ‌ట్టును నెంబర్ల ప‌ట్టిక‌లో ముందుకు తీసుకుళ్ళ‌డంలో చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు .దీంతో గ‌త ఐపిఎల్ లో చెనై సూప‌ర్ కింగ్ జ‌ట్టు చేసిన ఫ‌లితాల‌నే ఇప్పుడు కూడ పున‌రావృతం చేస్తుందంటూ అభిమానులు సంతోశిస్తున్నారు .