నిమ్మకాయల కోసం పోటీ

పట్టణంలోని ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు కార్యక్రమం వేడుకగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరుకావడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. కౌరవులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే ఘట్టం ఆధారంగా ఈ ఉత్సవం చేపట్టారు. అర్జునుడి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి,ఊరేగింపుగా తపస్సు మాను వద్దకు తీసుకువచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు.

అర్జున వేషధారి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కారు. మాను పైకెక్కిన అనంతరం వెంట తీసుకెళ్లిన నిమ్మకాయలు, విబూది పండ్లను కిందికి విసిరారు. ఈ నిమ్మకాయలను ఇంటి పూజా మందిరంలో ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నిమ్మకాయల కోసం వారు పోటీ పడ్డారు. చుట్టు పక్కల మం డలాల నుంచి వేలాదిగా విచ్చేసిన భక్తజ నంతో ఆలయ పరిసరా లు కిక్కిరిశాయి. ఆలయంలోనూ ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.