నేడే ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12గంటలకు విజయవాడలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న మొబైల్‌ నంబర్లకు ర్యాంకులను సంక్షిప్త సందేశాల ద్వారా పంపించనున్నారు. ఎంసెట్‌ ఫలితాలను www.eenadu.net, www.eenaduprathibha.net వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు.
టీవీ తెరపై ఎంసెట్‌ ఫలితాలు
ఎంసెట్‌ ఫలితాలు టీవీ తెరపై ప్రత్యక్షం కానున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్‌, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీలు ఎంసెట్‌ విద్యార్థుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదలయ్యాక… ఎంసెట్‌ ఫలితాల పేరుతో టీవీ తెరపై ప్రత్యేక సూచీ కనిపిస్తుంది. ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఉన్న వినియోగదారులు ఆ సూచీని ఎంపిక చేసుకొని హాల్‌ టికెట్‌ నెంబర్‌ టైప్‌ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.