నేల‌స‌రి నోప్పులు త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది .

 

సాదార‌ణంగా మ‌హిళ‌ల‌లో నెల‌స‌రి అనేది కామ‌న్ అనే చెప్పాలి .అయితే కొందరు మహిళలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని కష్టంగా భరించాల్సిన అవసరం లేదు. కొన్ని స‌ల‌భ‌త‌ర‌మైనా చిట్కాలు పాటించ‌డం వ‌ల‌న నెల‌స‌రి నోప్పుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు అంటున్నారు నిపుణులు . ,కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి.నెల‌స‌రి నొప్పులకు కారణం ఆ సమయంలో శరీరంలో అసమతౌల్యానికి గురయ్యే హార్మోన్లే! అయితే ఈ హార్మోన్ల అసమతౌల్యానికి ప్రధాన కారణం పోషకాహార లోపం అనే చెప్పాలి . దీంతోపాటు పర్యావరణం, కాలుష్యం, విషాలు, ఒత్తిడి… నెలసరి నొప్పులను పెంచుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నొప్పులను తగ్గించే చిట్కాలు పాటించాలి. అయితే వ్యాయామం చేయ‌డం వల్ల కండరాలు వదులవుతాయి. మరీ ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు క్రమంగా తగ్గుముఖం ప‌డ‌తాయి . నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్‌ ప్యాడ్‌తో కాపడం పెట్టినా ఫలితం ఉంటుంది. నెలసరిలో ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసినా కండరాలు రిలాక్స్‌ అయి, నొప్పులు తగ్గు ముఖం ప‌డ‌తాయి .ఈ సమయంలో విశ్రాంతి మంచి ఫలితాన్నిస్తుంది. పగటివేళ కొద్దిసేపు కునుకు తీస్తూ ఉండాలి