పంది క‌డుపున పిల్లాడు అస‌లు నిజ‌మిదే..

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మ‌రో వార్త సంచ‌ల‌నంగా మారింది. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్క‌డ చూసినా దీనిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని తుర్క‌ప‌ల్లి మండ‌లం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఓ పంది క‌డుపున మ‌గ పిల్లాడు పుట్టాడంటూ వార్త వైర‌ల్ గా మారింది. వార్త‌నే కాదు, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో కూడా తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ వార్త‌లో ఎంత‌మేర‌కు నిజముందో తెలియ‌దు కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది ఈ వార్త‌.

వాస్త‌వానికి నిజంగా పంది క‌డుపున మ‌గ‌పిల్లాడు పుట్టి ఉంటే, అది కూడా హైద‌రాబాద్ కు అతి స‌మీపంలోని యాదాద్రి జిల్లాలో పుట్టి ఉంటే మ‌న‌ మీడియా డైరెక్టుగా అక్క‌డికి వెళ్లి మినిట్ టూ మినిట్ అప్ డేట్స్ అందించేది. రియాలా వైరాలా అంటూ ఆగ‌మాగం చేసేది. కానీ అది జ‌ర‌గ‌లేదు. అంటే ఇది పూర్తిగా అబద్ధం. కేవ‌లం ఒకే ఒక్క వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదే రియ‌ల్ అంటూ జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్రయ‌త్నం చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ వీడియా మ‌న దేశంలో పుట్టింది కాదు, కెన్యాకు సంబంధించిన‌ది. అక్క‌డ కూడా వాస్త‌వంగా పంది క‌డుపున పిల్లాడు పుట్టాడో లేదో తెలియ‌దు కానీ, చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున వింత చోటు చేసుకుంద‌ని చెప్తే, ప్ర‌జ‌లు త‌ప్ప‌క‌ న‌మ్ముతార‌న్న ఉద్ధేశ్యంతో కావాల‌నే కొంద‌రు సృష్టించారని తెలిసిపోతుంది.