పూజ గ‌ది అనేది ఇలా వుండాలి

ఇంటికి పూజ గ‌ది అనేది చాలా ముఖ్య‌మైన‌ది .పూజాగదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూసుకోవాలి .. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. అంతే కాదు పూజ‌గ‌ది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కూడ‌దు .నైరుతి, ఆగ్నేయ గదులను పూజగదులుగా వాడకూడదు. అయితే తప్పని పరిస్థితిలో ఏ గదిలోనైనా ఈశాన్యపు అలమారలల్లో కానీ, పీటమీదగానీ దేవుడి పటాలు, ప్రతిమలు పెట్టుకోవచ్చు. ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం కనుక ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి.పూజగదిలో అనవసరపు బరువులు లేకుండా చూడటంతో పాటు ఎప్పుడూ పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం పూర్తిగా మూతపడకూడదు. ఈశాన్యాన పూజ గది నిర్మాణం కుదరనివారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చునని వాస్తుశాస్త్రం చెప్తోంది.ఈ విధంగా పూజ గ‌ది నిర్మాణం చేసుకుంటే మీ ఇంట్లో క‌ల‌త‌ల‌నేవి ఉండ‌వు .అంద‌రు సుఖ సంతోషాల‌దో జీవిస్తారు .