పౌరుషం ఉంటే కొండా సురేఖపై పోటీ చేసి గెలువు

ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు పౌరుషం ఉంటే కొండా సురేఖపై పోటీ చేసి గెలవాలని ఉమ్మడి వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొండా దంపతులు ఆగర్భ శత్రువులు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేసి గెలవాలన్నారు.

కార్యకర్తల అభీష్టం మేరకే పాలకుర్తి నియోజకవర్గ టికెట్‌ను కోరుతున్నానన్నారు. దయాకర్‌రావుకు పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం పట్ల పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. దయాకర్‌ రావు పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందుకలు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం పాలకుర్తి టికెట్‌ ఇవ్వకపోతే కార్యకర్తల అభీష్టం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.