ప్రియ వారియర్ కనుసైగలకు యువకులు రెడీయా!

సోషల్‌మీడియా సెన్సేషన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి అభిమానుల మనసు దోచుకున్నారు. ఆమె నటిగా పరిచయం కాబోతున్న చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’. రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ కథానాయకుడు. ఈ సినిమాలోని పాట వీడియోను ఫిబ్రవరిలో విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. ప్రియ కనుసైగలకు యువకులు ఫిదా అయ్యారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ఏ మాధ్యమంలో చూసిన ఆమే కనిపించారు.

ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇది నిజమయ్యేలా తెలుస్తోంది. తాజాగా ‘ఒరు అదార్‌ లవ్‌’ సినిమా తమిళ పాట టీజర్‌ను ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో ప్రియ, రోషన్‌ ఒకరినొకరు చూసుకుని.. తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.