ప్ర‌ధాని పీఠంపై చంద్ర‌న్న‌ క‌న్ను..?

చంద్ర‌బాబు ఒక అడుగు ముందుకు వేశారు. 18 గంట‌లు కేంద్రంపై త‌న‌దైన శైలిలో నిర‌స‌న చేశారు. ఆత‌ర్వాత ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విమ‌ర్శ‌ల‌కు తెర‌తీశాయి. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఒక్కో మాట‌… సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు. అయితే ఆయ‌న మాట‌లు ఇప్పుడు 2019 ఎన్నిక‌ల ముఖ చిత్రాన్ని చూపించాయంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. తాను మోడీకంటే సీనియ‌ర్‌ను అన్నారు చంద్ర‌బాబు. అంతేకాదు కేంద్ర నాయ‌కుల్లో త‌న‌కంటే తోపు నాయ‌కులు ఎవ‌రూ లేర‌ని… అంద‌రికంటే త‌న‌కే అనుభ‌వం ఎక్కువ ఉంద‌న్నారు. త‌న టైం బాలేక ముఖ్య‌మంత్రిగా ఉండిపోయార‌ట‌… మోడీ టైం బాగుండి… పీఎం అయిపోయారట‌. చంద్ర‌బాబు నోట ఇలాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అంటే చంద్ర‌బాబు పీఎం పీఠంపై క‌న్నేశారా..? అనేది రాజ‌కీయ విశ్లేష‌కుల ప్ర‌శ్న‌. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా పని చేసిన అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు పీఎం కావాల‌ని కోరుకోవ‌డం త‌ప్పు లేదు. ఎందుకంటే ఒక్క‌సారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి… వెంట‌నే ప్ర‌ధాని మ‌త్రి అయిన మోడీతో పోల్చితే చంద్ర‌బాబే సీనియ‌ర్‌. అందుకే బాబు నోట ఆ మాట వ‌చ్చింద‌నేది ప‌లువురి రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే ఆయ‌న ప్ర‌ధాని కావాల‌ని కోరుకోవ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏంటి అంటే… వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎలాగూ వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస్తే… టీడీపీ సైలెంట్ కావాలి వ‌స్తుంది. అలా కాకుండా… జాతీయ స్థాయిలో కూట‌మి క‌ట్టి… ప్ర‌ధాని మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాల‌నే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి చంద్ర‌బాబు క‌ల నెర‌వేరుతుందో లేదో చూడాలి.