ప‌వ‌న్ దారి… జ‌గ‌న్ దారి ఒక్క‌టేనా..?

ఏపీలో ఏం జ‌రుగుతుంది..? ఏపీ రాజ‌కీయాలు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టేనా..? ప‌్ర‌జ‌ల‌కు పిక్చ‌ర్ క్లియ‌ర్‌గా క‌నిపిస్తుందా..? ప‌్ర‌స్తుతం ఇవే సందేహాలు మొద‌ల‌య్యాయి. కానీ కొన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు మాత్రం… పిక్చ‌ర్ క్లియ‌ర్‌గా ఉందంటున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం ఫైటింగ్‌లు చేస్తున్న టీడీపీని ఇప్పుడు ప‌క్క‌న పెట్టారు. అయితే ప‌క్క‌న పెట్టింది అంద‌రూ కాదు కొంద‌రు మాత్ర‌మే. ఆ కొంద‌రిలో తెలుగు త‌మ్ముళ్లు లేరు. ఇక మిగిలిన వారిలో జ‌న‌సేన పార్టీకి చెందిన నేత‌ల‌తో పాటు… వైసీపీకి చెందిన వారూ ఉన్నారు. వీరిద్ద‌రిదీ ఒక‌టే టార్గెట్‌. వీరిద్ద‌రికీ ఒక‌రిపైనే గురి. ఆ టార్గెట్ ఎవ‌రో కాదు చంద్ర‌బాబు నాయుడు. ఎలాగైనా 2019లో చంద్ర‌బాబు అధికారంలోకి రాకూడ‌ద‌నేది వీరి అభిప్రాయం. మా నాయ‌కుడు సీఎం కావాల‌ని జ‌న సైన్యం… మా నాయ‌కుడే సీఎం కావాల‌ని వైసీసీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. వీరి భావ‌న‌లు బాగానే ఉన్నా… వీరిద్ద‌రూ క‌లిసి పోటీకి దిగుతార‌నే ప్ర‌చారం కూడా లేక‌పోలేదు. ఈ ప్ర‌చారం చేసే మూడో వ‌ర్గం మాత్రం… కొత్త అనుమానాల‌ను తెర‌పైకి తీసుకువ‌స్తుంది. నిజంగా చంద్ర‌బాబు కాకుండా… జ‌గ‌నో… ప‌వ‌నో.. అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల్సి వ‌స్తే… వీరిద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుదిరేది ఎలా..? అనేది ఇప్పుడు మొద‌లైన ప్ర‌శ్న‌. ఎందుకంటే… గ‌త ఐదేళ్లుగా… సీఎం పీఠం కోసం… జ‌గ‌న్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చోవాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి టైంలో… ప‌వ‌న్‌తో పోత్తు పెట్టుకుని… ఆ కూర్చీని వ‌దులుకోవ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే అస‌లు అది కుదిరేప‌నే కాదనేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ ప‌రిస్థితిలన్నింటినీ బేరీజు వేసుకుని ప్ర‌జ‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌వ‌న్ దారి జ‌గ‌న్ దారి ఒక్క‌ట‌వుతుందా లేదా అనే మీమాంస‌లో అంద‌రూ తెగ ఆలోచించేస్తున్నారు. అయితే ఈ క్లారిటీ ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే వ‌స్తుంది. పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు దిగితే… కొన్ని సీట్ల స‌ర్ధుబాట్లు జ‌రుగుతాయే త‌ప్ప‌… సీఎం కుర్చీని వ‌దులుకునేందుకు జ‌గ‌న్ సిద్ధంగా లేర‌నేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.