ఫోర్బ్స్‌ జాబితాలో అక్షయ్‌, సల్మాన్‌

ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ పత్రిక ఫోర్బ్స్‌ ప్రతి ఏడాది అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా పారితోషికం అందుకుంటున్నప్రముఖ నటుల జాబితాను విడుదల చేసింది.

అత్యధిక ఆదాయం సంపాదించిన పది మంది ప్రముఖుల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్‌ కుమార్‌ ఏడో స్థానం, సల్మాన్‌ఖాన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. జూన్‌, 2017 నుంచి ఈ ఏడాది జూన్‌ మధ్యకాలంలో అక్షయ్‌ సంపాదన 40.5మిలియన్‌ డాలర్లు(283.84 కోట్లు) కాగా, సల్మాన్‌సంపాదన​38.5మిలియన్‌ డాలర్లుగా(269.83కోట్లు) పోర్బ్స్‌ ప్రకటించింది. 748.5డాలర్ల (దాదాపు5245.86కోట్లు)తో హాలీవుడ్‌ అగ్ర నటుడు జార్జి క్లూనీ మొదటి స్థానంలో నిలిచారు.