బిజేపి నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌కాశ్ రాజ్ స‌మాదానం చెప్ప‌లేక‌పోయాడు

త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాధించుకున్నా వ్య‌క్తి ప్ర‌కాశ్ రాజ్ .అయితే త‌న ముందుంది ఎంత పెద్ద‌వారైనా స‌రే త‌న మ‌న‌సులో ఏముంటే అది చెప్ప‌డం ప్ర‌కాశ్ రాజ్ కు అల‌వాట‌నే చెప్పాలి .ఆ మ‌ధ్య సోష‌ల్ మిడియాలో ఒక కేసుకు సంబంధించి జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ప్ర‌ధాని మోడిని ట్విట్ట‌ర్ ద్వారా అడిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే ,అయితే ఆ పొస్ట్ వెలువ‌డిన వెంట‌నే ప్ర‌కాశ్ రాజ్ పై చాలా మంది బీజేపి నేత‌లు తిట్ల దాడి చెసిన విష‌యం కూడ ఎవ‌రికి చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నే అనాలి .అయితే తాజాగా బిజేపికి చెందిన సుబ్ర‌మ‌ణ్య స్వామి ,ప్ర‌కాశ్ రాజ్ ఇద్ద‌రు ఒకే వేదిక‌పై పాల్గోన్నారు .ప్ర‌కాశ రాజ్ లాగానే బిజేపికి చెందిన సుబ్ర‌మ‌ణ్య స్వామి కూడ ముక్కు సూటిత‌నం మ‌నిషి .అయితే అక్క‌డ జ‌రిగిన డిబేట్ లో ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ బిజేపి భార‌త్ దేశాన్ని హిందు దేశంగా మార్చాల‌ని చూస్తుంద‌ని ,దాని వ‌ల్ల మ‌న దేశంలోని ముస్తింలు చాలా న‌ష్ట‌పోతారంటూ చెప్పిన ప్ర‌కాశ్ రాజ్, ఇలాంటి ప‌రిస్థితి వేరే దేశాల్లో వుంటే అప్పుడు హిందువుల ప‌రిస్థితి ఎంట‌ని సుబ్ర‌మ‌ణ్య స్వామికి త‌న‌దైనా శైలిలో ఒక ప్ర‌శ్న‌ను వేశారు .అయితే దీనిపై సుబ్ర‌మ‌ణ్య స్వామి మాట్లాడుతూ బ‌య‌టి దేశాల‌లో వుంటున్నా హిందువులు ఆయాప్రాంతాల్లో ఒక్క దేవాల‌యం కూడ నిర్మించుకునే వీలు తేద‌ని ఆ అవ‌కాశం మ‌న భార‌త దేశం ముస్లింల‌కు క‌ల్పిస్తుంద‌ని చెప్పుకొచ్చారు . ఇవ‌న్ని విష‌యాలు మాట్లాడుతున్నా మీరు మ‌న హిందు దేవాల‌యాల‌ను చాలా మంది ముస్లిం రాజులు నేల‌కూల్చారు వాటిపై మీరు ఎందుకు స్పందించ‌డంలేదంటూ సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆ డిబేట్లో అడ‌గ‌గా ,దాంతో ప్ర‌కాశ్ రాజ్ అక్క‌డ ఎం మాట్లాడ లేక మౌనంగా ఉండి పోయారు .దీంతో సుబ్ర‌మ‌ణ్య స్వామి మాట‌ల‌కు ఆ ప్రాంగ‌ణం మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగింది .అయితే ఇప్ప‌టికైనా ప్ర‌కాశ్ రాజ్ బిజేపి వాళ్ళ‌ను విమ‌ర్శించ‌డం మానుకొని త‌న ప‌ని తాను చూసుకోవాలంటూ బిజేపి లోని కొంద‌రు నేత‌లు సూచిస్తున్నారు .అయితే ఎవ‌రినైనా విమ‌ర్శించే ముందు మొద‌ట మ‌నం విమ‌ర్శ‌ల‌పాలు కాకుండా చూసుకోవాలంటూ భ‌హిరంగ చ‌ర్చ‌లు కూడ జ‌రుగుతున్నాయి .