బెజ‌వాడ సాక్షిగా బిగ్ డ్రామా

ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. నాట‌కాలు ఆడే వాళ్లాను… నాట‌కాలు చేసేవాళ్ల‌ను… డ్రామాలు ర‌క్తిక‌ట్టించే వాళ్ల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతున్న‌ప్పుడు కూడా గ‌మ‌నించారు. ఏపీకి రాజ‌కీయనాయ‌కులు ద‌గ్గ‌రుండి ఎలా అన్యాయం చేశారో గ‌మ‌నించారు. ఏ ప‌రిస్థితిలో రాష్ట్రాన్ని విడ‌గొట్టారో క‌ళ్లారా చూశారు. అయితే అప్పుడు నోరుమూసుకున్నార‌ని పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌క్కువ అంఛ‌నా వేశారు. కానీ ఆ రియాక్ష‌న్ 2014 ఎన్నిక‌ల్లో క‌నిపించింది. ఏపీ ప్ర‌జ‌లంటే ఏంటో… త‌మ ఓట్ల‌తో నిరూపించుకున్నారు. రాష్ట్రాన్ని ఓ కుట్ర‌తో విడగొట్టిన కాంగ్రెస్‌ను… మ‌క్కిలిర‌గొట్టి… మూల‌న కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఏపీ ప్ర‌జ‌లు చూస్తూనే ఉన్నారు. హోదా కోసం… మొన్న‌టి వ‌ర‌కూ నాట‌కాల‌డిన వాళ్లు… ఇప్పుడు కొత్త డ్రామాలు మొద‌లుపెట్ట‌డం అంతా గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం వేడిక‌గా చేసుకుని… టీడీపీ అధినేత ధ‌ర్మ దీక్ష‌కు దిగ‌డంపైనే ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచి మొద‌లైన విమ‌ర్శ‌లు. మొన్న‌టి వ‌ర‌కూ ఎంపీలు ఢిల్లీలో దీక్ష‌లు చేప‌ట్టారు. అది వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని తిరుగ‌ముఖం ప‌ట్టారు. ఇప్పుడు చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో దీక్ష‌కు దిగారు. అదే ఢిల్లీ వెళ్లి ఉంటే…. అక్క‌డ న‌డిచే డ్రామా ప్ర‌జ‌ల‌కు అర్ధం కాదు. కానీ ఇప్పుడు క్లియ‌ర్‌గా అర్ధ మ‌వుతుంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు… పాత వాగ్ధానాల‌ను… పాత హామీల‌ను ఎక్క డ నెర‌వేర్చాల్సి వ‌స్తుందో అని… కొత్త డ్రామా మొద‌లుపెట్టారు. హోదా పేరుతో అస‌లు విష‌యాన్ని తుంగ‌లోకి తొక్కేశారు. ఇప్పుడు అంతా హోదా జ‌పం చేస్తున్నారు. వాస్త‌వానికి హోదా వ‌స్తుందో రాదో అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా తెలుసు. చంద్ర‌బాబుకు కూడా తెలుసు. కానీ ఏదొక డ్రామా న‌డ‌ప‌క‌పోతే… గుర్తింపు రాదు. రాష్ట్రం కోసం తాము పోరాటం చేస్తున్నామ‌ని… ప్ర‌జ‌ల‌కు చెప్పుకోవ‌డానికి ఇంత‌కు మించిన మంచి త‌రుణం మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే బెజ‌వాడ సాక్షిగా బిగ్ డ్రామా మొద‌లైంద‌నేది… రాజ‌కీయ విమ‌ర్శ‌కుల అభిప్రాయం.