బొప్పాయితో అక్క‌డ కూడా వెంట్రుక‌లు మొలుస్తాయి

బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోను ఉండవు. అందరికీ అందుబాటు ధరలో ప్రతి చోటా లభిస్తుంది. మన ఆరోగ్యానికి బొప్పాయిపండు ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది. వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది. టీబీని నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలోని దోషాలను నివారిస్తుంది. రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్ చేస్తుంది. బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు. బొప్పాయి పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది. నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది. బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది. బొప్పాయి పువ్వు ఒక‌టి తీసుకుని బాగా న‌లిపి దాన్ని పేను కొరికిన చోట రుద్దితే అక్క‌డ వెంట్రుక‌లు మ‌ళ్లీ మొలుస్తాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఇలా చేస్తే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. బొప్పాయి చెట్టు కాండానికి గాటు పెడితే అందులోంచి పాలు వ‌స్తాయి. ఆ పాల‌ను తీసుకుని చ‌ర్మంపై రాస్తే తామ‌ర‌, గ‌జ్జి వంటి చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.