బ్రిటీష్ వాళ్ళ‌ను ప‌చ్చ జెండాతో త‌రిమికొట్టిన తెలుగుదేశం పార్టీ

మ‌న టాలివుడ్‌లో వ‌చ్చె సినిమాలు అన్ని దాదాపు కామిడితో తెర‌కెక్కేవే అని చెప్ప‌వ‌చ్చు ,అయితే మ‌న రాజ‌కీయ నాయ‌కులు చేసే కామిడి ముందు ఈ కామిడి సినిమాలు ఎందుకు ప‌నికిరావ‌నే చెప్పాలి .కొన్ని భ‌హిరంగా స‌భ‌ల‌లో మ‌న రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడే మాట‌లు విని న‌వ్వు ఆపుకోలేని సంద‌ర్బాలు చాలా ఉన్నాయి . కాని అంద‌రు రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడే మాట‌లు ఒక ఎత్తైతే తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయ‌కులు మాట్లాడే మాట‌లు మాత్రం మ‌రో ఎత్త‌నే చెప్పాలి .తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ధ‌ర్మ‌పోరాట స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ బ్రిటీష్ వాళ్ళ‌ను తెలుగుదేశం పార్టీ త‌రిమికొట్టింది అంటూ చెప్పుకొచ్చారు .దీంతో ఈ వార్తా సోష‌ల్ మిడియాలో వైర‌ల్గా మారింది .దీనిపై నెటిజ‌న్‌లు స్పందిస్తూ 1982 లో ఏర్ప‌డినా తెలుగు దేశం పార్టీ బ్రిటీష్ వాళ్ళ‌ను ఎలా త‌రిమికొట్టిందంటూ సెటైర్‌లు వేస్తున్నారు .అయితే నెటిజ‌న్లు వేసే సెటైర్‌లకు స‌మాదానం చెప్ప‌లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారంటూ ప్ర‌తిప‌క్ష‌పార్టీ వాళ్ళ నుండి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి .రాజ‌కీయ నాయ‌కులు అబ‌ద్దం చెప్ప‌డం తెలుసు కాని సొంత పార్టీ వాళ్ళే న‌మ్మ‌లేని అబ‌ద్దాలు చెప్ప‌డం ఒక చంద్ర‌బాబుకే చెల్లిందంటూ సోష‌ల్ మిడియాలో పోస్టులు కూడ వెలువ‌డుతున్నాయి .