బ‌యోపిక్ ప‌క్క‌న పెట్టిన బాల‌య్య

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ఎన్టిఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నా విష‌యం అంద‌రికి తెలిసిందే,ఇప్పుడు ఈ బ‌యోపిక్ను పక్క‌న పెట్టి వెరే సినిమాకు ఫ్లాన్ చేస్తున్నారు .ద‌ర్శ‌కుడు తేజ త‌ప్పుకోవ‌డంతో ఈ సినిమాను మొద‌ట‌గా బాల‌కృష్ణ డైరెక్ట్ చెయాల‌ని భావించారు .కాని ఒక వైపు ఎమ్మెల్యే గా ఉంటూ మ‌రో వైపు ద‌ర్శ‌క‌త్వ బాద్య‌త‌లు నిర్వ‌హించ‌డం వీలు కాక పోవ‌డంతో బ‌యోపిక్ సినిమాను ప‌క్క‌న పెట్టారు . దీంతో బాల‌కృష్ణ చేయ‌బోయే నెక్ట్స్ సినిమా ఎంట‌ని అభిమానుల‌లో ఒక ప్ర‌శ్న మొద‌లైంది . గ‌తంలో వినాయ‌క్‌తో బాల‌కృష్ణ‌ ఒక సినిమా చెయ‌బోతున్నార‌ని వార్తలోచ్చాయి . ఐతే ప్ర‌స్తుతం ఎన్టిఆర్ బ‌యోపిక్ ఆగిపోవ‌డంతో వినాయ‌క్‌తో చేసే సినిమాను బాల‌కృష్ణ‌ సెట్స్ పైకి తీసుకెళుతున్నారు . ఇప్పుడు ఈ సినిమా ముహూర్తం డేటు కూడ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది .సి .క‌ళ్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నా ఈ సినిమాను ఈ నెల 27 తారీఖున ప్రారంభించ‌బోతున్నారు . ఖైది నెం 150 సినిమా హిట్ తో వినాయ‌క్ మంచి ఫామ్‌లో ఉన్నారు .గ‌తంలో వినాయ‌క్ బాల‌కృష్ణ‌తో చెన్న‌కేశ‌వ రెడ్డి సినిమా తీసారు .అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌కృష్ణ‌,వినాయ‌క్ కాంభినెష‌న్లో ఒక్క సినిమా కూడ రాలేదు ,దాంతో వీరిద్ద‌రి కాంభినేష‌న్లో రాబోతున్నా ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో భారి అంచ‌నాలే నెల‌కొన్నాయి .వినాయ‌క్ బాల‌కృష్ణ‌లో తీసిన మొద‌టి సినిమా ఫ్యాక్ష‌న్ నేపథ్యంలో రూపోందింది .ఐతే ఇప్పుడు రెండో సినిమా వినాయ‌క్ ఏ బ్యాక్ డ్రాఫ్‌లో తెర‌కెక్కిస్తున్నాడో తెలుసుకోవాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే .