భార్య అశ్లీల వీడియోలు తీసి..

భార్య అశ్లీల వీడియోలు తీసి అదనపు కట్నం తేకపోతే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడిన భర్త, అత్తమామాలతో సహా నలుగురిపై మహిళా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చెన్నై కీల్‌పాక్కానికి చెందిన ముబారక్‌ అహ్మద్‌. ఇతని సోదరుడు సంగమ్‌షేక్‌ దౌత్‌ ఉగాండా దేశంలో వ్యాపారం చేస్తూ అక్కడే కుటుంబంతో నివశిస్తున్నాడు. ఇతని కుమార్తె సంగమ్‌హస్మీ. ఈమెకు మదురై అళగప్పన్‌ నగర్‌. బందర్‌ వీధికి చెందిన అల్లావుద్దీన్‌ఆసిక్‌తో గత జనవరిలో వివాహం జరిగింది. వివాహ సమయంలో 140 సవర్ల నగలు, కారు వరకట్నంగా ఇచ్చారు. అనంతరం అల్లావుద్దీన్‌ఆసిక్‌ వ్యాపారం ప్రారంభించడానికి సంగమ్‌షేక్‌దౌత్‌ ఉగాండా నుంచి రూ.25 లక్షలు బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

సంగమ్‌హస్మి ధరించిన నగలను కూడా భర్త ఇంటి వారు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సరిపెట్టుకోకుండా అదనపు కట్నం తేవాలని అల్లావుద్దీన్‌ఆసిక్‌ భార్యను హింసించేవాడు. అంతేగాకుండా భార్యను అశ్లీలంగా వీడియో తీసి అదనపు కట్నం తేకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సంగమ్‌హస్మి ఉగాండాకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారితో వాపోయింది. ఈ వ్యవహారంపై చెన్నైలో ఉన్న సంగమ్‌షేక్‌దౌత్‌ తమ్ముడు ముబారక్‌అహ్మద్‌ మదురై మహిళా పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు అల్లావుద్దీన్‌ ఆసిక్‌ (28), ఇతని తండ్రి అల్లావుద్దీన్‌ (62), తల్లి జిన్నత్‌ (50), అన్న జలావత్‌ (37). ఈ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.