భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన భర్త

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ భార్యతో రాష్ట్ర పోలీస్‌ విభాగంలో పనిచేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గతంలో పంచాయతీలు జరిగినా వారిలో మార్పురా లేదు. తన భార్య వైఖరిపై అనుమానంతో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ డ్యూటీకి వెళుతున్నానని చెప్పి రహస్యంగా తిరిగివచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటనపై పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించి వారి ఎదుట ఈ నిర్వాకాన్ని బయటపెట్డాడు.

పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్ట్‌ చేశారు. ఈ∙సంఘటన ఆదివారం కోదాడ పట్టణంలో జరిగింది. పట్టణ ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలం బూరుగుగడ్డ గ్రామానికి చెందిన కుక్కడపు వెంకటేశ్వర్లు సూర్యాపేటలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కొండల్‌రావు అనే కానిస్టేబుల్‌కు 2016లో బూరుగుగడ్డకు చెందిన మహిళతో వివాహమైంది.

వివాహానికి పూర్వమే ఆమెకు వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఉంది. వివాహం అనంతరం కూడా సంబంధం కొనసాగడం ఆమె భర్త దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అతడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఆమె ఇకపై తాను సక్రమంగా నడుచుకుంటానని తెలపడంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో కాపురం పెట్టారు. శనివారం రాత్రి తను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పడంతో ఆమె వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసింది.

తన ఫోన్‌లో రికార్డింగ్‌ విన్న కొండల్‌రావు విషయం తెలుపుకుని డ్యూటీకి వెళ్లినట్లే వెళ్లి తిరి గి వచ్చే సరికి ఆమె వెంకటేశ్వర్లుతో ఉంది. దీం తో కొండల్‌రావు బయట నుంచి తలుపు గడియ పెట్టి ఇరుగు పొరుగు వారిని పిలవడంతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. దీనితో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తీసిన సమయంలో వ్యవహారం బట్టబయలైంది. దీంతో పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనలో కొండల్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.