మహేష్ సినిమా కోసం విజయశాంతి ఎంత డిమాండ్ చేసింది

మహేష్ బాబు మహర్షి సినిమా మే 9 న రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఇదిలా ఉంటె ఇందులో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే యూనిట్ ఆమెను సంప్రదించగా… మహేష్ సినిమాలో యాక్ట్ చేసేందుకు రాములమ్మ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి కోటిన్నర డిమాండ్ చేసిందని… ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

విజయశాంతి హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. శ్రీరాములమ్మ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతున్నది.