మా సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా ఉద్యమం

బంజారాహిల్స్‌ : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష న్‌(మా) సభ్యత్వం ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తానని సినీ నటి శ్రీరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్‌ ప్రసాద్‌ను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సినీ పెద్దలను పిలిపించి తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా ఒప్పించాలని, కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు…

తన స్నేహితురాలు సోనుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.